లోబీపీ ఉన్నవారు తీసుకోవలసిన ఆహారం

 


Low blood pressure :మనలో కొంతమంది లో బిపి తో బాధపడుతూ ఉంటే కొంతమంది హైబీపీతో బాధపడుతూ ఉంటారు ఈరోజు లో బిపి గురించి మాట్లాడు కుందాము. బిపి సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటే లోబీపీ అని అంటారు హై బీపీ ఎంత ప్రమాదకరమో లో బిపి కూడా అంతే ప్రమాదకరం. చాలా మందికి ఈ విషయం తెలియదు లో బిపి వచ్చినప్పుడు శరీరంలో అన్ని అవయవాలకు రక్త సరఫరా ఆగిపోతుంది ఆ సమయంలో గుండె పోటు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. లో బిపి రావడానికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం రక్తహీనత సమస్య ఉండటం కొన్ని రకాల మందులు వాడటం వంటివి కారణాలు కావచ్చు సమస్య పరిష్కారానికి గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగాలి వీటిలో ఉండే కెఫిన్ రక్తపోటు సరైన స్థాయిలో ఉండేలా చేస్తుంది రోజు నీటిని ఎక్కువగా తీసుకుంటూ వుండాలి విటమిన్ బి 12 లోపం ఉన్న లో బిపి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బి 12 ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. పాలకూర గుడ్లు పాలు చేపలు దుంపలు వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకోవాలి. లో బిపి గా అనిపించినప్పుడు ఒక ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని తాగితే సరిపోతుంది. అలా అని ఇలా ఇంటి చిట్కాలు తో కాకుండా డాక్టర్ ను కూడా సంప్రదించాలి డాక్టర్ సూచనలు పాటిస్తూ ఈ చిట్కాలు ఫాలో అవ్వండి