సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం

 


జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగాంగా నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ నేతలు సర్వం సిద్ధం చేశారు. సాయంతం 5 గంటలకు సభ ప్రారంభించాలని నేతలు నిర్ణయించారు. సభకు ప్రజలు భారీగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంపరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కంట్రోల్‌ రూం మీదుగా వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించారు. అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు ఎస్‌బీఐ, చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బషీర్‌బాగ్‌, అబిడ్స్‌ నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, కోఠివైపు, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి బషీర్‌బాగ్‌ వచ్చే వాహనాలు హిమాయత్‌నగర్‌వైపు మళ్లించనున్నారు. సభ కోసం భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తారు. మొదటి వేదికపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. రెండో వేదికని కళాకారులకోసం ఏర్పాటు చేయగా, మూడో వేదికపై పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఉంటారు. వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. స్టేడియం ప్రతి గేటు వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు నేతలు తెలిపారు.