ఆర్ ఆర్ ఆర్ కథ లీక్?

 


రాజమౌళి తన సినిమాల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకుంటూ సినిమా లు చేసుకుంటూ పోతాడు.. అందుకే అయన సినిమాలలో ఎక్కువగా హిట్ అయినా సినిమాలే ఉంటాయి. ఇప్పటివరకు తన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు అంటే రాజమౌళి తన సినిమాలను ఎంత బాగా తీస్తాడో అర్థం చేసుకోవచ్చు అందుకే ఆయన్ని టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. తాను చేసిన ఒక్కో సినిమా తో హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ స్థాయిని మార్చాడు. బాహుబలి తో అయన పేరు ఎంతలా వెలిగిపోయిందో ప్రేత్యకంగా చెప్పనవసరం లేదు.. టాలీవుడ్ పేరు ను దేశమంతటా వినిపించిన ఘనత ఆయనది..బాలీవుడ్ లో రాజమౌళికి బ్రహ్మరథం పట్టారు.. అక్కడి హీరో లు కూడా తమ సినిమా చేయాలి అని కోరారు. కానీ రాజమౌళి ప్రస్తుతం బాహుబలి తర్వాత టాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తున్నారు.. rrr అంటూ రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లతో పవర్ ఫుల్ మల్టీ స్టారర్ గా ఆయన ఈ సినిమా చేస్తున్నారు.. ఇప్పటివరకు ఇలాంటి స్టార్స్ ని పెట్టి ఏ దర్శకుడు టాలీవుడ్ లో సినిమా చేయలేదు.. స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమా ల ట్రెండ్ ను రాజమౌళి మొదలుపెట్టారని చెప్పాలి.. ఇక ఇటీవలే ఈ సినిమా కథ లీక్ అయ్యిందంటూ కొన్ని పోస్ట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో సీతారామరాజు బాగా చదువుకుంటాడు. బ్రిటిషర్ల రూలింగ్ లో, వాళ్లకు అనుకూలంగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, సక్రమంగా లీగల్ పద్ధతుల్లో దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ భీమ్ మాత్రం యుద్ధంతోనే స్వతంత్రం వస్తుందని నమ్ముతాడు. తన తండా జనాలకు యుద్ధరీతులు నేర్పుతూ, గొరిల్లా దాడులతో ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఒక దశలో కొమరం భీమ్ ను రామ్ చరణ్ అరెస్ట్ చేస్తాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో సీతారామరాజు-భీమ్ కలుస్తారు. ఈ స్టోరీ సోషల్ మీడియా లో తెగ సర్క్యులేట్ అవుతుండగా దీన్ని ఆప్ ప్రయత్నం చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్..