ఈ పద్ధతులు పాటిస్తే క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు


 

ఎప్పటినుంచో ప్రపంచాన్ని భయపెడుతున్న రోగం క్యాన్సర్. క్యాన్సర్ ఒకటి రెండు కాదు. ఎన్నో రకాల క్యాన్సర్ లు శరీరంలోని అన్ని భాగాలకు వస్తున్నాయి. చర్మం నుంచి కాలేయం వరకు ప్రతి అవయవానికి వ్యాపిస్తుంది క్యాన్సర్. ఇంత ప్రాణాంతకమైన క్యాన్సర్ ని ముందుగానే రాకుండా నివారించాలి. క్యాన్సర్ ఒక్కసారి సోకిందంటే కష్టం. కాబట్టి.. క్యాన్సర్ రాకుండా ఈ ముందు జాగ్రత్తలు పాటించండి. క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడండి.... మనం తినే ఆహార పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నివారించవచ్చు అనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే.. మనం క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చో తెలుసుకొండి ..క్యాన్సర్ ను జయించండి... కోకోలో ఫ్లెవనాయిడ్స్ పెంటమీర్ వంటి ఎఫెక్టివ్ కంటెంట్ క్యాన్సర్ ఎదుర్కోనే లక్షణాలను కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్ కోకో అధికంగా ఉంది. కోకలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కు సంబంధించిన ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. క్యాన్సర్ ను నివారిస్తుంది.. క్యాన్సర్ నివారించే ఫుడ్స్ లో బెర్రీస్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. హిమాలయా గోజిబెర్రీ ఏసియా బెర్రీ గ్రేట్ ఫుడ్. వీటిలో క్యాన్సర్ ని అరికట్టే గుణాలు అద్భుతంగా ఉంటాయి. గ్రీన్ టీ ఈసీసీజీని కలిగి ఉంటుంది. దీనిలోని పోలిఫినాల్‌ అనేది క్యాన్సర్‌ సెల్‌ పెరుగుదలను క్రమంలో ఉంచుతుంది. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ లెవల్స్‌ పై ప్రభావం చూపుతుంది. అనేక పరిశోధనల్లో 6 కప్పులు గ్రీన్ టీ తాగే వారిలో బ్లడ్ క్యాన్సర్ రిస్క్ తగ్గినట్లు కనుగొన్నారు. అంతే కాదు, గ్రీన్ టీలో బరువు తగ్గించే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది కరోనరీ డిసీజ్ లను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను మ్యానేజ్ చేస్తుంది. న్యూరాలజికల్ వ్యాధులను నివారిస్తుంది.