పైన రన్ వే కింద రోడ్డు


 

చెన్నై : రాష్ట్రంలో తొలిసారిగా మదురైలో విమానాల రన్‌వే కింద నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకానుంది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో 1942లో మదురైలో విమానాశ్రయం నిర్మించారు. 1956లో తొలి ప్రయాణికుల విమానం చెన్నై-మదురై-తిరువ నంతపురం మధ్య ప్రారంభమైంది. అనంతరం క్రమేణా విమానాశ్రయం విస్తరింపబడి రెండు టెర్మినళ్లతో రాష్ట్రంలో చెన్నై తరువాత రెండవ పెద్ద విమానాశ్రయంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మదురై నుంచి చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, రాజమండ్రి, తిరుపతి తదితర నగరాలకు శ్రీలంక, దుబాయ్‌, సింగపూర్‌ దేశాలకు విమానాలు నడుపు తుండగా, నెలకు 1.25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ విమానా శ్రయం ప్రస్తుతం 7,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 12,500 చదరపు అడుగులకు పెంచే చర్యలు పదేళ్ల కిత్రం ప్రారంభమయ్యాయి. ఇందుకోసం స్థల సేకరణలో ఇబ్బందులు రావడంతో పనుల ప్రారంభంలో జాప్యం జరిగింది. విస్తరణకు అయన్‌ పాపకుడి, పెరుంగుడి సహా ఆరు గ్రామాలకు చెందిన 3,100 మంచి నుండి సుమారు 460 ఎకరాలు, 615 ప్రభుత్వ పోరంబోకు భూములను సేకరణ 90 శాతం పూర్తయింది. భూములిచ్చిన యజ మానులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.166 కోట్లను కేటాయించింది. విమానాశ్రయ విస్తీరణ పనులు చేపడితే మదురై రింగ్‌ రోడ్డు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొనగా, దక్షిణ జిల్లాల నుంచి మదురై వచ్చే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. దీనిని అధికమించేలా విమాన రన్‌వే కింద నాలుగు లేన్ల రోడ్డు నిర్మించాలని తాజాగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జర్మనీలో రన్‌వే కింద రోడ్డు నిర్మించి వాహనాల రాకపోకలు జరుగు తున్నాయి. అలాగే, ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి లాల్‌ బహుదూర్‌ విమానాశ్రయ సమీపంలో పైన రన్‌వే, కిందన వారణాసి-లక్నో జాతీయ రహదారి నిర్మించారు. అదే విధంగా మదురైలోను విమాన రన్‌ వే దిగువన జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఆదివారం జరిగిన సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ఉదయకుమార్‌, కలెక్టర్‌ అన్బళగన్‌, విమానాశ్రయ డైరెక్టర్‌ సెంథిల్‌వళవన్‌, ఎమ్మెల్యేలు మాణిక్యం, పెరియపుల్లన్‌, ఎస్‌ఎస్‌ శరవణన్‌ సహా అధికారు లు పాల్గొని చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఉదయకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, దక్షిణ జిల్లాల ప్రజల దీర్ఘకాలిక కోరికగా ఉన్న మదురై విమానాశ్రయాన్ని విస్తరించేలా రన్‌వే కోసం చేపట్టిన స్థల సేకరణ పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రన్‌వే విస్తరణలో వారణాసి విమానాశ్రయంలో ఉన్నట్లు అండర్‌పాస్‌ విధానాన్ని అమలు చేయనున్నా మన్నారు. ఆ ప్రకారం, పై భాగంలో విమాన రన్‌ వే, కింది భాగంలో రింగ్‌ రోడ్డు ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక తయారు చేస్తున్ననట్లు మంత్రి తెలిపారు.