నాని కొత్త సినిమా కు ముహూర్తం ఖరారు

 

తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన ఇండస్ట్రీలో మొదటగా శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్ లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేశాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నానికి మంచి గుర్తింపు రావడంతో వరసగా అవకాశాలు తలుపు తట్టాయి. ఆయన తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోలో ఒక్కరిగా ఎదిగారు. దేశంలో కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'V' అనే సినిమాతో థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమాలో నాని నటనకు మంచి మార్కులే పడ్డా.. రొటీన్ రివేంజ్ స్టోరీ అంటూ కామెంట్స్ వినపడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోగా సుధీర్ బాబు నటించాడు. మొత్తంగా నాని లాండ్ మార్క్ 25వ సినిమా థియేటర్స్‌లో కాకుండా కరోనా కారణంగా ఓటీటీలో విడుదల కావడం విశేషం.
తాజాగా నాని శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించారు. మరోవైపు నాని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా 'శ్యామ్ సింగరాయ్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 1970-80 నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు ఈ సినిమా పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. మరోవైపు నాని ఈ శుక్రవారం 'ష్.. ఎవరికీ చెప్పొద్దు' రేపు మంచి రోజట.. రేపు మాట్లాడుకుందాం అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో 28వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో తెరకెక్కుతుందనే విషయాన్ని రివీల్ చేయలేదు. ఏమైనా దీపావళి కానుకగా నాని తన అభిమానులకు కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌తో పండగ గిప్ట్ ఇవ్వనున్నాడు.