జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

 


న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు అరెస్టు అయిన ఉగ్రవాదుల నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్ పాటు పది లైవ్ కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం రాత్రి మిలీనియం పార్క్‌, సారాయ్‌ కాలే ఖాన్‌ సమీపంలో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్టు పోలీసులు వెల్లడించారు.జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారాకు చెందిన ఉగ్రవాదులను అబ్దుల్‌ లతీఫ్‌ (22), అష్రఫ్‌ ఖటన (20)గా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. ఢిల్లీలో ఉగ్రవాదులు పట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ వ్యాప్తంగా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.