DRDO మరో రికార్డు


డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) మరో రికార్డును అందుకుంది. డీఆర్డీవో తయారు చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ (క్యూఆర్ఎస్ఏఎం) సిస్టమ్, ఐదు రోజుల వ్యవధిలోనే రెండో టెస్ట్ పాస్ అవ్వడం విశేషం. గాల్లో ఎగురుతున్న టార్గెట్ ను ఈ మిసైల్ విజయవంతంగా ఛేదించిందని అధికారులు సగర్వంగా ప్రకటించారు. ఒడిశా తీరంలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత మూడు నెలలుగా డీఆర్డీవో వరుసగా పలు రకాల ఆయుధాలను పరీక్షిస్తోంది. చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 7న పీఎస్‌ఎల్‌వీ-సీ49 ప్రయోగం క్యూఆర్ఎస్ఏఎం సిస్టమ్, ఐదు రోజుల వ్యవధిలోనే రెండో టెస్ట్ పాస్ అయింది. క్యూఆర్ఎస్ఏఎం క్షిపణి వ్యవస్థను తొలుత నవంబర్ 13న ప్రయోగించారు. అది విజయవంతం అయింది. ఈ మిసైల్ పనితీరును మరింతగా పరిశీలించడంతో పాటు, వార్ హెడ్ లను మోసుకుంటూ వెళ్లడాన్ని మరింత నిశితంగా సమీక్షించేందుకు రెండోసారి ప్రయోగించారు. గాల్లోకి విమానాన్ని పోలిన డ్రోన్ ను వదిలి, దాన్ని టార్గెట్ చేశారు. ఇందులో కూడా సక్సెస్ అయింది. డీఆర్డీఓ మిసైల్ విజయవంతం అయినందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు..