పబ్జి కమింగ్ సూన్


 

చైనాతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 116 యాప్స్ ను భారత్ నిషేధించగా.. అందులో గేమింగ్ యాప్ పబ్జీ కూడా ఉంది. అక్టోబర్ 30 నుంచి పబ్జీ తన కార్యకలాపాలను పూర్తిగా ఆపేసింది. అతి పెద్ద మార్కెట్ కలిగిన భారత్ లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు పబ్జీ యత్నిస్తోంది. త్వరలోనే పబ్జీ మొబైల్ ఇండియాను లాంచ్ చేయనుంది. భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తి డేటా భద్రతతో గేమ్ ను తీసుకొస్తున్నట్టు పేర్కొంది. భారత వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచే స్టోరేజీ సిస్టమ్స్ పై ఎప్పటికప్పుడు ఆడిట్, వెరిఫికేషన్స్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. భారత్ లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని పబ్జీ కార్పొరేషన్, దాని మాతృ సంస్థ క్రాఫ్టన్ లు భావిస్తూ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ మద్దతుతో భారత్ లో యాప్ ను తిరిగి లాంఛ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉంది. అందుకు సంబంధించి క్లౌడ్ డీల్ ను కుదుర్చుకుంది. యూజర్ల డేటాను దొంగిలించే అవకాశం ఉందని భారత్ లో పబ్జీ ని బ్యాన్ చేశారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సహాయంతో యూజర్ల డేటాను అజూర్ క్లౌడ్ నెట్వర్క్ లో దాచడానికి పబ్జీ పేరెంట్ కంపెనీ క్రాఫ్టన్ భావిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం చెప్పినట్లుగా డేటా లోకలైజేషన్ భయాలు ఉండవు.పబ్జీ, పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ గేమ్స్ కు సంబంధించి భారత యూజర్ల మొత్తం డేటాను అజూర్ క్లౌడ్ సర్వర్స్ లోనే ఉంచనున్నారు. లోకలైజేషన్ పాలసీని పబ్జీ సంస్థ పాటించబోతూ ఉండడంతో పబ్జీని అడ్డుకోడానికి ఎటువంటి రూల్స్ ఉండవని నిపుణులు చెబుతూ ఉన్నారు. చూస్తుంటే వీలైనంత త్వరలో పబ్ జీ భారత్ లో మరోసారి దుమ్ము రేపనుంది.