ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్ బెంగళూర్ డీ

 


అబుదాబి: ఐపీఎల్‌-13లో శుక్రవారం రాత్రి జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు ఢీకొననున్నాయి. కీలక పోరులో ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు మాత్రం ఫైనల్‌ చేరేందుకు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే రెండో క్వాలిఫయర్‌ ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడిపోగా.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన సన్‌రైజర్స్‌ ఉత్సాహంతో ఉంది. ఇరుజట్లు లీగ్‌ దశలో రెండు సార్లు తలపడగా చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లోనూ ఫామ్‌ను కొనసాగించి ఫైనల్‌కు చేరువ కావాలని వార్నర్‌సేన పట్టుదలగా ఉంది.