దేశంలో సౌరశక్తి తో నడిచే మొట్టమొదటి మినీ రైల్


 

తిరువనంతపురం : దేశంలో సౌరశక్తితో నడిచే మొట్టమొదటి మినీ రైలును తిరువనంతపురంలోని వేలి టూరిస్ట్‌ విలేజ్‌ వద్ద కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ రైలు పూర్తిగా పిల్లలను ఆకర్షించే విధంగా ఉంది. ఈ రైలులో మూడు బోగీలు ఉన్నాయి. ఇవి ఒకేసారి 45 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవు. పర్యావరణ అనుకూల సౌరశక్తితో 2.5 కిలోమీటర్లు పనిచేసే ఈ మినీ రైలు సందర్శకులకు ప్రకృతి సౌందర్యాన్ని చేరువచేస్తుందని ముఖ్యమంత్రి ప్రసంగంలో తెలిపారు.