మరోసారి సత్తా చాటిన భారత సైన్యం


 

భారత సైన్యం మరోసారి సత్తా చాటింది. ఉగ్రవాద మూలాలను పెకిలించే కార్యక్రమం చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ మరోమారు విరుచుకుపడినట్లు పీటీఐని ఉటంకిస్తూ జాతీయ మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. భారత వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, 10 మంది పాక్ సైనికులు కూడా హతమయ్యారని తెలిపింది. ఈ దాడిలో మరో 20 మందికి పైగా గాయపడ్డారని జాతీయ మీడియా ప్రకటించింది. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి జొచ్చుకువచ్చేందుకు సిద్ధమౌతుండగా భారత వైమానిక దాడులు జరిగినట్లుగా కథనాలు వెలువడ్డాయి. అయితే, ఎల్‌ఓసీ వద్ద ఎయిర్ స్ట్రైక్స్ జరిపినట్లుగా జాతీయ మీడియా ఛానెళ్లలో ప్రసారమౌతున్న కథనాల్లో నిజం లేదని భారత ఆర్మీకి చెందిన లెఫ్టెనెంట్ జనరల్ పరమ్‌జిత్ స్పష్టం చేశారు.