పాకిస్తాన్ను హెచ్చరించిన భారత విదేశాంగ మంత్రి అనురాగ్ శ్రీవాస్తవ


 

: గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ (Gilgit-Baltistan) ప్రాంతానికి తాత్కాలిక ప్రొవెన్షియల్‌ ( provincial status) హోదాను కల్పిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంత పర్యటనలో భాగంగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్, బాల్టిస్తాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా ప్రకటించిన కొన్నిగంటల్లోనే.. భారత్ (India) దీనిని తీవ్రంగా ఖండించింది. ఈ చర్య భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నమేనంటూ భారత విదేశాంగశాఖ (Ministry of External Affairs) అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ పాకిస్తాన్‌ను హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌తోపాటు లడఖ్‌తోపాటు, గిల్గిత్, బాల్టిస్తాన్ మొత్తం ప్రాంతం కూడా భారత్‌లో అంతర్భాగమేనని అనురాగ్ శ్రీవాస్తవ (Spokesperson Anurag Srivastava) స్పష్టం చేశారు. చట్ట విరుద్దంగా.. బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై పాకిస్తాన్‌కు ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు. గిత్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతంలో ఏడు దశబ్దాలుగా మానవహక్కుల ఉల్లంఘన జరగుతుందని అనురాగ్ శ్రీవాస్తవ పాకిస్తాన్‌పై మండిపడ్డారు. దీంతోపాటు దోపిడీ చేసి స్వేచ్ఛను హరిస్తోందని.. అయితే ఇలాంటి దురాక్రమణల వల్ల ఈ ప్రాంతంలోని నిజాలను ఎవరూ దాచలేరని ఆయన పేర్కొన్నారు. భారతీయ భూభాగాల స్థితిని మార్చే బదులు.. వారి ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని పాకిస్థాన్‌కు భారత్హెచ్చరించింది