కళ్యాణ లక్ష్మి పథకం పై కీలక నిర్ణయం


 

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే పేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదు అనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఆడపిల్ల తల్లిదండ్రులకు మొదట సహాయంగా 50 వేల రూపాయలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఆ సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి పథకం లో భాగంగా లక్ష నూట పదహారు రూపాయలు ప్రస్తుతం ఆర్థిక సహాయం అందుతుంది. పేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదు అన్న ఉద్దేశ్యమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు కళ్యాణ లక్ష్మి పథకం లో భాగంగా లబ్ధిపొందారు అనే చెప్పాలి. రాష్ట్ర బడ్జెట్లో కల్యాణలక్ష్మి పథకానికి ప్రత్యేకంగా ఎక్కువ మొత్తంలో కేటాయింపు జరుగుతుంది రాష్ట్రప్రభుత్వం. కాగా కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ శుభ వార్త చెప్పింది. కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి కల్యాణలక్ష్మి పథకానికి గాను 337.50 కోట్లను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేసి బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది కల్యాణలక్ష్మి పథకానికి గాను ఇప్పటివరకు ఆరు వందల 75 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి కళ్యాణ లక్ష్మి పథకం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది తల్లిదండ్రులకు సత్వరంగా ఖాతాలోకి డబ్బు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.