కెసిఆర్ కు షాక్ ధరణి పై హైకోర్టు స్టే


 

హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల విషయంలో వివరాలు నమోదు ప్రక్రియపై దాఖలైన అంశాలపై కోర్టు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తింది. ఎలాంటి భద్రతాపరమైన అంశాలు పరిగణలోకి తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు. ఏమాత్రం తేడా వచ్చిన ఇబ్బందులు తలెత్తుతాయని స్పష్టం చేసింది. ప్రజలకు ఏది ధరణి వెబ్ సైటో తెలియటం లేదని. గూగుల్ ప్లే స్టోర్ లో ధరణిని పోలిన మరో నాలుగు యాప్స్ ఉన్నట్లు వ్యాఖ్యానించింది. అన్ని వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. అప్పటి వరకు ధరణిలో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల వివరాలు నమోదు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాలు భయటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించింది. వివరాలు భయటకు పొక్కితే వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు ఈ ఆస్తుల వివరాలు ఏ చట్టం ప్రకారం సేకరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. కొత్త రెవెన్యూ చట్టం కేవలం వ్యవసాయ భూములకే వర్తిస్తుందని స్పష్టం చేసింది