బ్యాంకింగ్ రంగంలో కొత్త విధానం ఫింగర్ ప్రింట్ తో క్యాష్ విత్ డ్రా


 

బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు రోజురోజుకూ జరుగుతూనే ఉన్నాయి. ఖాతాదారుల కోసం ఎన్నో సులభ పద్దతులను ప్రవేశపెడుతూనే ఉంది బ్యాంకింగ్ రంగం. ఒకప్పుడు అకౌంట్ బుక్ తో బ్యాంకుకు వెళ్లి డబ్బులను తెచ్చుకోవాల్సి వచ్చేది.. కాని రానురాను బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతూ డబ్బులను తీసుకోవడానికి ఎన్నో సులభతర పద్ధతులను తెచ్చింది. ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏటీంఎం లు ఏర్పాటు చేసింది. దానికి డెబిట్ కార్డు ఉంటే చాలు ఎక్కడైనా ఈజీగా మనీ తీసుకునే ఫెసిలిటీని కల్పించింది. ఇదే గొప్ప మార్పు అనుకుంటే పొరపాటే సుమా.. కేవలం ఫింగర్ ప్రింట్ తో ఏటీఎంలలో మనీని తీసుకునే అవకాశాలను కల్పిస్తోంది. దీనితో కస్టమర్లు డెబిన్ కార్డును తీసుకపోవక్కర్లేదు, పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరమూ లేదు. దీనితో పాటుగా మీ దగ్గర ఫోన్ ఉండాల్సిన పనీ లేదు. కేవలం మీ ఫింగర్ ప్రింట్ తో సులభంగా ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసేసుకోవచ్చు. అధునాతన టెక్నాలజీ ద్వారా ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పింస్తున్నది. అయితే ఈ వెలసలుబాటు డీసీబీ బ్యాంక్ ఫింగర్ ప్రింట్ ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంక్ నుంచి క్యాష్ తీసుకోవాలనుకునే వారు బ్యాంక్ ఆధార్ నెంబర్ తో లింక్ అయ్యి ఉండాలి. దీనితో పాటుగా కచ్చితంగా ఆధార్ నెంబర్ తెలిసుంటే మీరు ఈసీగా ఫింగర్ ప్రింట్ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.