
యునైటెడ్ అరబ్ ఎ క్వాలిఫైయర్మి క్వాలిఫైయర్రేట్స్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అనేక మలుపులు తిరుగుతూ.. అనూహ్య ఫలితాలను చవిచూస్తూ … ఉత్కంఠత రేపుతూ ఆఖరి దశకు వచ్చేసింది.. ఇవాళ ముంబాయి ఇండియన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతున్నది.. గత రికార్డులను, గణాంకాలను పరిశీలిస్తే మాత్రం ముంబాయి ఇండియన్స్‌కే ఫైనల్ ఛాన్సులున్నాయని అనిపిస్తోంది.. కానీ టీ-20 మ్యాచ్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా! ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారవచ్చు.. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్‌లలో ముంబాయి టీమ్ అయిదుసార్లు ఫైనల్స్‌కు చేరింది. నాలుగుసార్లు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.. ఇప్పుడు అయిదో కప్పు కోసం ముచ్చటపడుతోంది.. మరోవైపు ముంబాయిని ఎదుర్కోబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఫైనల్స్‌కు చేరలేదు.. అందుకే ఈసారి సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించి తుదిపోరుకు చేరుకోవాలని ఆరాటపడుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తక్కువేమీ లేదు.. ఆ జట్టులోనూ తురుమ్ఖాన్లు ఉన్నారు.. కాబట్టి ఇవాళ జరిగే మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందనుకోడానికి వీల్లేదు.. కాకపోతే ఢిల్లీ జట్టు ఈ దశకు చేరుకోడానికి అష్టకష్టాలు పడింది.. 14 లీగ్ మ్యాచ్‌లలో ఎనిమిదింటిలో గెలిచి, ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది.. అయితే మొదటి తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింటిని గెల్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచేసిన ఢిల్లీ ఆ తర్వాత ఎందుకో తడబడింది.. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది.. ఇక తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఢిల్లీ టీమ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమతూకంగా ఉన్నాయి.. ఈ జట్టులోని కీలక ఆటగాడు శిఖర్ ధావన్ ఇప్పటి వరకు 525 పరుగులు చేశాడు.. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పంత్, స్టొయినిస్‌లు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పారు.. ఇక బౌలింగ్‌లో రబడ అద్భుతంగా రాణిస్తున్నాడు.. ఈ టోర్నీలో ఇప్పటివరకు పాతిక వికెట్లు తీసుకుని టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అతనికి అండగా నోర్జే నిలుస్తున్నాడు.. అక్షర్ పటేల్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ తన అనుభవాన్ని అంతా కనబరుస్తున్నాడు.. అయితే వరుసగా నాలుగు ఓటములు చవి చూసిన తర్వాత కానీ ఢిల్లీ టీమ్‌లో ఉన్న బలహీనతలు బయటపడలేదు.. దూకుడుగా ఆడేవారు ఒక్కరు కూడా లేరు.. అసలు టీ-20 అంటేనే సిక్స్‌లు, ఫోర్లు.. బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు బాదే బ్యాట్స్‌మెన్ లేరు. ఓపెనర్లు కుదురుగా నిల్చోవడం లేదు.. ఈ బలహీనతను అధిగమిస్తే ఢిల్లీకి ఎదురుండదు..
ఇక ముంబాయి ఇండియన్స్ విషయానికి వస్తే లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో తొమ్మిది మ్యాచ్‌లను గెల్చుకుంది. అయిదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇందులో రెండు సార్లు సూపర్ ఓవర్లోనే ఓటమి చెందింది. ముంబాయికి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.. ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు.. ఒకరు త్వరగా పెవిలియన్‌కు చేరినా ఆ బాధ్యతను మరొకరు మోస్తున్నారు. డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు చక్కగా రాణిస్తున్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే 400 పరుగులకు పైగా సాధించారు.. పోలార్డ్, హార్దక్ పాండ్యాలు చెలరేగితే ఆపడం కష్టం.. బౌలింగ్‌లోనూ బలంగానే ఉంది. బుమ్రా, బౌల్ట్‌లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.. బుమ్రా ఆల్రెడీ 23 వికెట్లు తీసుకున్నాడు.. బౌల్డ్ కూడా 20 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ ఆడతాడా ? గాయం తీవ్రత పెరగకుండా విశ్రాంతి తీసుకుంటాడా అన్నది సస్పెన్స్‌గా ఉంది. మొన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఏదో పంతం కొద్దీ ఆడినట్టు అనిపించింది.. మైదానంలో చురుగ్గా కదలలేకపోయాడు.. ఇక ఈ సీజన్లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి.. రెండుసార్లూ ముంబాయే గెలిచింది.