దేశీయ పంటలు

 


సాంప్రదాయ వరి సాగు, విత్తనోత్పత్తిలో దిట్ట వెంకన్న పాత పంటల దిగుబడుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, వీటిని పండిస్తే సమాజానికి ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందించడవచ్చని తపన పడుతున్న రైతు మైలారం వెంకన్న. వరి పంటలో సుసంపన్నమైన జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ విత్తనోత్పత్తి చేపడుతూ శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంటున్న ప్రకృతి వ్యవసాయదారుడాయన. ఆర్‌ఎంపీ వైద్యుడు కూడా అయిన వెంకన్న ఆదర్శ సేద్యపు వివరాలు ఆయన మాటల్లోనే... జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం జీడికల్‌ గ్రామం మాది. నాకు 12 ఎకరాల పొలం ఉంది. 8 ఎకరాల్లో మామిడి, కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నా. మిగతా నాలుగు ఎకరాల్లో నవారా, కాలాబట్టి, రత్నచోడి, నారాయణ కామిని, సిరిసన్నాలు, రక్తశాలి వంటి సాంప్రదాయ వరి వంగడాలను ఇప్పటికి ఏడేళ్లుగా సాగు చేస్తున్నా.