గూగుల్ పే యూజర్లకు షాక్ న్యూస్

 


Google Pay news: వెబ్​యాప్ సేవలు 2021 జనవరి నుంచి నిలిపివేయనున్నట్లు గూగుల్ పే తెలిపింది. అలాగే తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది.   గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​-టూ-పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నిలిపేసేందుకు సిద్ధమైంది. దీనితో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు వసులు చేయాలని భావిస్తున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలిసింది. గూగుల్​ పే ప్రస్తుతం మొబైల్ యాప్​ సహా.. పే డాట్ గూగుల్​ డాట్​కామ్ ద్వారా నగదు బదిలీ సేవలందిస్తోంది. జనవరి నుంచి వెబ్​ యాప్ సేవలు నిలిచిపోనున్నట్లు ఓ నోటీసులో పేర్కొంది గూగుల్ పే. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి.ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.