బీట్‌రూట్ జ్యూస్ ప్రతిరోజూ తీసు కోవడం వల్ల ప్రయోజనాలు


 

హైదరాబాద్ : బీట్‌రూట్ జ్యూస్ ప్రతిరోజూ తీసు కోవడం వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు... బీట్‌రూట్‌ నిత్యం తీనేవారికి గుండె సమస్యలు దరి చేరవని పలు పరిశోధనలు చెబుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ జ్యుస్ తీసుకోవడంవల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. -బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ సమస్య ఉండదు. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా బీట్ రూట్ రసం కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ వల్ల లివర్ శుభ్రమవుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. -ఇలా రోజూ గ్లాసుడు బీట్ రూట్ రసం తాగితే రోజంతా ఉత్సాహంగా వుండవచ్చు. ఇది ఎనర్జీ డ్రింక్ కంటే ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలసట కూడా రాదు. -బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. -గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. -బీట్‌రూట్ వల్ల రక్తంలో నైట్రేట్ రెట్టింపవుతుంది. దీనివల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది. పండుగ సీజన్ లో వీటినే ఎక్కువగా కొన్నారు...!