కేకుల్లా అమ్ముడు పోయే టికెట్స్

 


భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న వన్డే,టీ 20 మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల అమ్ముడుపోయాయి. కాన్‌బెర్రాలో జరిగే మూడు వన్డేలు, సిడ్నీలో జరిగే మూడు టీ20ల మ్యాచ్‌ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) రెండు రోజులుగా విక్రయిస్తున్న టికెట్లు 80 శాతం వరకు ఆమ్ముడుపోయాయి. కేవలం 2 వేల లోపు టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని సీఏ పేర్కొంది.ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో జూలై 17 నుండి స్టేడియంల్లోకి అభిమానులను అనుమతి ఇవ్వడం లేదు. అయితే ఆసీస్,ఇండియా జట్ల మధ్య జరిగే సిరీస్‌లో పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాన్‌బెర్రా, సిడ్నీ స్టేడియాల్లో జరిగే మ్యా్చ్‌ల కోసం 50% టిక్కెట్లను అమ్మకానికి ఉంచారు. ఈ రెండు నగరాల్లో కరోనా అదుపులోనే ఉండడంతో పరిమిత సంఖ్యలో అభిమానులను స్టేడియాల్లోకి అనుమతి ఇస్తున్నారు. కరోనా టైంలో ఇంగ్లాండ్ వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్‌ జట్ల మధ్య టోర్నీలు జరిగాయి. ఈ మ్యాచ్‌లు అన్ని ఖాళీ స్టేడియాలలోనే జరిగాయి. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అభిమానులను లేకుండానే దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియంలో మ్యాచ్‌లు జరిగాయి. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పలు నగరాలలో కోవిడ్ ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో.. సామాజిక దూర పరిమితులను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా స్టేడియాల్లోకి తక్కువ సామర్థ్యంతో సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా సారథి కోహ్లీ పూర్తిగా అందుబాటులో ఉండడు. అందుబాటులో ఉన్న మ్యాచ్‌ల్లోనే అతని ఆటను చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది కూడా వేగంగా టికెట్ల అమ్మకాల వెనుక ఒక పెద్ద కారణం కావచ్చు, ఇరు జట్లు మధ్య చాలా ఏళ్ళుగా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు . ఈ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్‌ను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ సిరీస్‌లో అభిమానులను మైదానాల్లోకి ఆలో చేస్తుంది. ఇక దక్షిణాసియా ప్రాంత ప్రజలు ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటారు.. టీమిండియా పర్యటనకు ఎప్పుడు జరిగిన టిక్కెట్లన్నీ ఈజీగా అమ్ముడైపోతాయి. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు ఆ కష్టాల నుంచి గట్టేక్కాలంటే ఇప్పుడున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆసీస్ బోర్డు చూస్తోంది.