క్వార్టర్‌ఫైనల్లోకి ప్రజ్ఞేష్‌ గుణ్ణేశ్వరన్


 

కేరీ(అమెరికా): అట్లాంటిక్‌ టైర్‌ ఛాలెంజర్స్‌ టెన్నిస్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రజ్ఞేష్‌ గుణ్ణేశ్వరన్‌ దూసుకెళ్ళాడు. గురువారం రాత్రి జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో ప్రజ్ఞేష్‌ 6-7(3-7), 6-2, 7-6(7-5)తో జాక్‌ సోక్‌(అమెరికా)పై చెమటోడ్చి నెగ్గాడు. ఈ మ్యాచ్‌ను గెలిచేందుకు ప్రజ్ఞేష్‌ సుమారు మూడు గంటలు కష్టపడాల్సి వచ్చింది. సెమీఫైనల్‌ బెర్త్‌కై ప్రజ్ఞేష్‌ బ్రెజిల్‌ క్వాలిఫయర్‌ థామజ్‌ బెల్లుసితో తలపడనున్నాడు. 32ఏళ్ల బెల్లుసి గతంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌ 21లో నిలవడంతోపాటు 4 ఏటిపి టైటిల్స్‌ను నెగ్గాడు. ప్రస్తుతం బెల్లుసి 297 ర్యాంక్‌లో, ప్రజ్ఞేష్‌ 146 ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఈ టోర్నీ బరిలోకి దిగిన మరో భారత ఆటగాడు రామ్‌కుమార్‌ సింగిల్స్‌, డబుల్స్‌లో పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.