ఓటమి దిశగా ట్రంప్


 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలపుపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికే 45 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మరో ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. అందులో నాలుగు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు అధ్యక్ష పీఠం దక్కే అవకాశాలు కన్పించడం లేదు. అందువల్ల మొత్తం ఆ ఐదు రాష్ట్రాల్లోనూ ట్రంప్ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. ప్రస్తుతం పెన్సిల్వేనియా (20), జార్జియా (16), నార్త్ కరోలినా (15), అలస్కా (3)లో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, నెవాడా (6)లో బైడెన్ ముందంజలో ఉన్నారు. దీంతో ట్రంప్‌ మరోమారు అధ్యక్ష పీఠం అందుకోవడం కష్టంగా మారింది. నెవాడాలో విజయం సాధిస్తే.. నెవాడాలో విజయం సాధిస్తే అమెరికా అధ్యక్ష పదవిని బైడెన్ సొంతం చేసుకోనున్నారు. బైడెన్ ఖాతాలో ఇప్పటికే 264 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. నెవాడాలో 6 ఎలక్టోరల్ ఓట్లు ఉండటంతో బైడెన్ అక్కడ గెలుపొందితే విజయానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లకు చేరుకుంటారు. కాగా, ఆరిజోనా (11), మిషిగన్ (16) రాష్ట్రాల్లో బైడెన్ విజయం సాధించారు. అక్కడ చివరి వరకు ట్రంప్ బైడెన్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగింది. అయితే చివరికి బైడెన్‌నే గెలుపు వరించింది. మిషిగన్ ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ట్రంప్ సుప్రీంకోర్టులో దావా వేశారు. ఆరిజోనాలో డెమొక్రాటిక్ అభ్యర్థి 72 ఏండ్ల తర్వాత విజయం సాధించారు.