బీహార్ ఎన్నికల్లో సుమారు ఏడు లక్షల ఓట్లు నోట కే వేశారు


 

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్‌డిఎ కూటమి మరో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించేందుకు సన్నాహకాలు సిద్ధం చేసుకుంటుంది. అయితే...ఈ ఎన్నికల్లో నోటా (నన్‌ ఆఫ్‌ ద ఎబవ్‌) కూడా భారీగా పోలయ్యాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకెవరికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. సుమారు 7 లక్షల మంది బీహారీలు నోటాకు ఓటేశారని ఎలక్షన్‌ కమిషన్‌ డేటా తెలిపింది. ఇసి విడుదల చేసిన గణాంకాల ప్రకారం...ఇప్పటి వరకు 6,89,135 మంది నోటాను వినియోగించారు. అంటే బీహార్‌ మొత్తం ఓట్లలో 1.69 శాతం అన్నమాట. 2013లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై నోటా బటన్‌ను ఏర్పాటు చేశారు.