తెలంగాణ (దోస్త్‌) ఇంట్రా కాలేజీ విడతకు అవకాశం : రేపటినుంచి 20 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు


 

- రేపటినుంచి 20 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు - కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ఇంట్రా కాలేజీ విడతకు అవకాశం కల్పించారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే కాలేజీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ కాలేజీలో కోర్సు, కాంబినేషన్‌, మాధ్యమం మార్చుకునేందుకు అవకాశముందని కోరారు. విద్యార్థులు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మంగళవారం నుంచి ఈనెల 20 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. ఈనెల 21న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు.