ఆసీస్కు బయలుదేరిన టీమిండియా జట్టు


 

కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఆసీస్ కు ప్రయాణమైంది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో వివిధ రకాల జట్లకు ఆడిన భారత ఆటగాళ్లు మళ్ళీ ఒక్క జట్టుగా ఏర్పడి ఆసీస్ టూర్ కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు అందరూ కొత్త రకం పిపిఈ కిట్లను ధరించి ఉన్నారు. అయితే ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత జట్టు మొత్తం మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో డిసెంబర్ 17-21 వరకు జరిగే మొదటి టెస్టులో మాత్రమే భారత కెప్టెన్ విరాట్ ఆడనున్నాడు. ఎందుకంటే... ప్రస్తుతం కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్. వారు జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో కోహ్లీ తిరిగి భారత్ కు వచ్చేస్తాడు.