తగ్గిన బంగారం ధర పెరిగిన వెండి ధర


 

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.20 తగ్గి రూ.52,030కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.10 తగ్గుదలతో రూ.47,700కు చేరింది. బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పడితే వెండి ధర ఏకంగా రూ.4800 పెరుగుదలతో రూ.68,400కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1887 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.11 శాతం పెరుగుదలతో 24.83 డాలర్లకు చేరింది.