ఆర్మీ జవాన్ భార్యను అయినదుకు గర్వంగా ఉంది అని అన్న అమర జవాన్ ప్రవీణ్ రెడ్డి భార్య

 


Martyred Jawan Praveen Reddy: తన భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉందని అమర జవాన్ ప్రవీణ్‌ రెడ్డి భార్య రజిత అన్నారు. ఆర్మీ జవాన్ భార్యను అయినందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. తన తండ్రి కూడా ఆర్మీ జవాన్‌ అని, ఆయన కూడా దేశం కోసమే ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్నారు. ఒక ఆర్మీ జవాన్‌ కుమార్తెగా పుట్టినందుకు, మరో ఆర్మీ జవాన్‌కు భార్య అయినందుకు తన జీవితం ధన్యమైందని తెలిపారు. తమకు పెళ్లై పదేళ్లు అయ్యిందని.. ఇన్ని ఏళ్లలో ప్రవీణ్‌ ఎన్నో మధుర ఙ్ఙాపకాలను ఇచ్చారని వాటితోనే బ్రతికేస్తానని బరువెక్కిన హృదయంతో చెప్పుకొచ్చాా కాగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు తెలుగు జవాన్లు కూడా ఉన్నారు. వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్‌ రెడ్డి ఒకరు కాగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్‌ మరొకరు. జవాన్ల మరణాలతో వారి వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయ.