ప్రభాస్ నాగ్ అశ్విన్ లా సినిమా పట్టాలెక్కిది ఎప్పుడు

 


యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ఫాలోయింగ్, క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరింది. 'బాహుబలి' సిరీసులతో ప్రభాస్ ఓవర్ నైట్లోనే వరల్డ్ స్టార్ గా మారిపోయాడు. అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన చూసిన వారంతా అతడికి అభిమానులుగా మారిపోయారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించి టాలీవుడ్ సత్తాను చాటింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ 'బాహుబలి' తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమా తర్వాత తన ఇమేజ్ వరల్డ్ వైడ్ అవుతుందని ప్రభాస్ అంచనా వేయలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రభాస్ తన తదుపరి చిత్రాలను ఇద్దరు యంగ్ హీరోలతో ప్రకటించినట్లు అర్థమవుతోంది. ఇందులో ఒకటి 'సాహో'.. కాగా మరొకరి 'రాధేశ్యామ్'. సాహో చిత్రాన్ని యంగ్ దర్శకుడు సుజిత్ తెరకెక్కించాడు. ప్రభాస్ ఇమేజ్ సరిగ్గా హ్యండిల్ చేయలేకపోయాడు. దీంతో ఈ సినిమాకు రావాల్సిన కలెక్షన్లు రాలేదు. ఆ తర్వాత ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని 'ఒక్కడున్నడు' ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్‍ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సుజిత్ ప్రభాస్ ఇమేజ్ ను సరైన రీతిలో చూపించలేక చతికిలపడగా తాజాగా రాధాకృష్ణ కుమార్ సైతం అలాగే చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏడాదికి పైగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'రాధేశ్యామ్' నుంచి పెద్దగా అప్డేడ్స్ రావడం లేదు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ప్రభాస్ తదుపరి సినిమాలపై ప్రభావం పడుతోంది. 'రాధేశ్యామ్' తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీని, ఓం రావత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' మూవీని చేయనున్నాడు. 'రాధేశ్యామ్' ఆలస్యం ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులు పడుతోంది. ప్రభాస్ ముందుగా బాహుబలి ఇమేజ్ ను ముందుగా అంచనా వేయలేక యంగ్ దర్శకులకు కమిటవడంతోనే ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కోసం ఈ దర్శకులు చాలా ఏళ్లపాటు వెయిట్ చేయడంతో తప్పనిసరిగా వారితో మూవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్లానింగ్ లోపంతోనే ప్రస్తుతం అతడి క్రేజీ ప్రాజెక్టులు మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తున్నాయనే టాక్ విన్పిస్తోంది. ప్రభాస్ ఇప్పటికైనా 'రాధేశ్యామ్' త్వరగా పూర్తిచేసి క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.