వచ్చే ఏడాది సర్కార వారి పాట సినిమా షూటింగ్


 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ఒ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కథను ఎప్పుడో సిద్ధం చేసినప్పటికీ కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. లాక్‌డౌన్ నుంచి కేంద్రం సడలింపులు ఇవ్వడంతో.. సర్కారు వారి పాట మేకర్స్ యూఎస్ వెళ్లి నవంబర్ నుంచి షూటింగ్ స్టాట్ చేయాలని ప్లాన్ వేశారు. కానీ, పలు కారణాల వల్ల ఈ ఏడాది సర్కారు వారి పాట షూట్ లేనట్టే అని తెలుస్తోంది. అయితే డిసెంబర్ చివర్లో యూఎస్ వెళ్లి.. జనవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే మహేష్ మాత్రం క్రిస్మస్, న్యూయర్ సెలబ్రెట్ చేసుకునేందుకు ఫ్యామిలీతో కాస్త ముందుగానే యూఎస్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. క్రిస్మస్, న్యూయర్ తర్వాత మహేష్ షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నట్టు టాక్‌.