బ్రిటన్‌లో పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లు ఇక కనుమరుగు


 

లండన్‌: పదేళ్ల తర్వాత బ్రిటన్‌లో పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే కార్లు ఇక కనుమరుగు కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2030 నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాల అమ్మకంపై నిషేధం విధించనున్నట్లు వచ్చే వారం బ్రిటిష్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బ్రిటిష్‌ ప్రభుత్వం 2040 నుంచి వీటి అమ్మకాలపై నిషేధం విధించాలనుకుందట. అయితే గ్రీన్‌హౌజ్ వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు బోరిస్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా సమాచారం. దీంతో ప్రధాని నిషేధం గడువు కాలాన్ని తగ్గించినట్లు అక్కడి ‍ఫైనాన్స్‌ టైమ్స్‌ మీడియా పేర్కొంది.