ఒలంపిక్స్ లో క్రికెట్


 

ప్రస్తుతం భారత్లో క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ముందు ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తం గా కూడా అన్ని దేశాలలో ప్రస్తుతం క్రికెట్ కి అంతకంతకు క్రేజ్ పెరిగిపోతుంది. క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులు అందరూ స్టేడియం లకు భారీగా చేరుకోవడం తో పాటు టీవీల కు అతుక్కు పోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అంతే కాదు ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ ను మరింత రసవత్తరం గా మారి పోతూ ఉండడం తో పాటు ప్రేక్షకులందరూ క్రికెట్ క్రీడతో ఎంతో ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న క్రికెట్ క్రీడను ఒలంపిక్స్ లో చేర్చాలని ఎన్నో రోజుల నుంచి ఒక డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒలంపిక్స్ లో ఉండే క్రీడలకు మరింత ఎక్కువ గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఒలంపిక్స్ క్రీడలకు ఎంతో గౌరవం కూడా ఉంటుంది. ప్రతి క్రీడాకారుడు ఒలింపిక్స్ లో పతకం సాధించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పటికే ఒలింపిక్స్ లో దాదాపుగా అన్ని రకాల క్రీడలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒలంపిక్స్ లో క్రికెట్ ని చేర్చాలని డిమాండ్ గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఇండియా మాజీ కెప్టెన్, టీమిండియా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్. ప్రతిష్ఠాత్మకమైన ఒలంపిక్స్ లో టి20 క్రికెట్ ను చేర్చండి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 75దేశాలలో క్రికెట్ ఆడుతున్నారని క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేరిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ క్రికెట్ కి మెరుగైన సదుపాయాలు ఉండాలని దాని కోసం మరింత సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తాడు.