మల్టీస్టారర్ చేయబోతున్నా పవన్ కళ్యాణ్


 

చాలా రోజుల తరువాత సినిమా షూటింగ్స్ తో బిజీగా మారుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ ఓ లాయర్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మలయాళం హిట్టు సినిమా అయ్యప్పన్ కొశీయుమ్ రీమేక్ కు దర్శక నిర్మాతలు చాలా పవర్ఫుల్ గా రెడీ అవుతున్నారు.సినిమాను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయాలని పవన్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చాడు. దీంతో పక్కా ప్లాన్ తో షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు దర్శకుడు సాగర్ చంద్ర.సినిమాలో మరో హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పోలీస్ పాత్రలో పవన్ నటిస్తున్నట్లు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరో హీరో పాత్రపై మాత్రం కొంచెం కూడా క్లారిటీ ఇవ్వలేదు. నితిన్, సాయి ధరమ్ తేజ్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి గాని ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. .అయితే ఫైనల్ గా రానా ఫిక్స్ అయ్యేలా ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా ఆ ప్రాజెక్టుకి సంబంధించిన చర్చలు జరిగినట్లు చెప్పాడు. దర్శక నిర్మాతలతో మాట్లాడడం జరిగిందని అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం ఫైనల్ కాలేదని చెప్పాడు. దీంతో రానా చర్చల అనంతరం అన్ని ఒకే అయిన తరువాత ఎనౌన్స్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమాను మొదలుపెట్టి వచ్చే వేసవి కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు...!!