ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను వాయిదా వేసింది

 

. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 16 (సోమవారం) నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా... ఒక్కో సెక్షన్‌కు అనుమతించే విద్యార్థుల సంఖ్య 88 నుంచి 40కి తగ్గించడాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టులో సవాలు చేశాయి. దీంతో ఆన్‌లైన్ ప్రవేశాల్లో ఆలస్యం అవ్వడంతో... తరగతుల పున:ప్రారంభం వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నిజానికి నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ కేసులు తగ్గడంతో... ప్రభుత్వం వాటిని తిరిగి ప్రారంభించింది. దశలవారీగా కాలేజీలను కూడా తెరవాలనుకుంది.

ఆ ప్రకారం... సోమవారం నుంచి తెరవాలని ముందుగా అనుకున్నా... ఇప్పుడు వాయిదా వేసింది.

కాలేజీలు ఎప్పుడు తెరిచేదీ... మళ్లీ కొత్త షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తెలిపారు. క్లాసుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించిన అంశంపై ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌మెంట్లు... కోర్టుకు వెళ్లకుండా ఉండి ఉంటే... సోమవారం క్లాసులు ప్రారంభమయ్యేవే. ప్రైవేట్ యాజమాన్యాలు ఏమంటున్నాయంటే... తరగతి గదికి 88 మంది విద్యార్థులు ఉండాల్సిందే అంటున్నాయి. 40 మంది విద్యార్థులతోనే క్లాసులు చెప్పాలంటే... తమకు భారం అవుతుందనీ... ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.విద్యార్థుల సంఖ్యపై మతలబు ఏర్పడటంతో... ఇప్పుడు ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు సమస్య తలెత్తింది. ఈ సంఖ్య సంగతి తేలితే తప్ప... అడ్మిషన్లపై ముందుకు వెళ్లే అవకాశం లేదు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు... ఆఫ్‌లైన్ అడ్మిషన్లు జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటున్నాయి. ప్రభుత్వం ముందుగా ఎలాంటి ప్రకటనా చెయ్యకుండా... ఆన్‌లైన్ అడ్మిషన్లు జరపాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి ఇన్నాళ్లూ కరోనా వల్ల తెరచుకోని కాలేజీలు... ఇప్పుడు కొత్త సమస్యల వల్ల ఓపెన్ కావట్లేదు. మరి కోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఓవరాల్‌గా చూస్తే... కరోనాకి వ్యాక్సిన్ వస్తే తప్ప... ఇలాంటి సమస్యలకు బ్రేక్ పడేలా కనిపించట్లేదు. తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా... ఒక్కో సెక్షన్‌కు అనుమతించే విద్యార్థుల సంఖ్య 88 నుంచి 40కి తగ్గించడాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టులో సవాలు చేశాయి. దీంతో ఆన్‌లైన్ ప్రవేశాల్లో ఆలస్యం అవ్వడంతో... తరగతుల పున:ప్రారంభం వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నిజానికి నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ కేసులు తగ్గడంతో... ప్రభుత్వం వాటిని తిరిగి ప్రారంభించింది. దశలవారీగా కాలేజీలను కూడా తెరవాలనుకుంది. ఆ ప్రకారం... సోమవారం నుంచి తెరవాలని ముందుగా అనుకున్నా... ఇప్పుడు వాయిదా వేసింది. కాలేజీలు ఎప్పుడు తెరిచేదీ... మళ్లీ కొత్త షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తెలిపారు. క్లాసుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించిన అంశంపై ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌మెంట్లు... కోర్టుకు వెళ్లకుండా ఉండి ఉంటే... సోమవారం క్లాసులు ప్రారంభమయ్యేవే. ప్రైవేట్ యాజమాన్యాలు ఏమంటున్నాయంటే... తరగతి గదికి 88 మంది విద్యార్థులు ఉండాల్సిందే అంటున్నాయి. 40 మంది విద్యార్థులతోనే క్లాసులు చెప్పాలంటే... తమకు భారం అవుతుందనీ... ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.విద్యార్థుల సంఖ్యపై మతలబు ఏర్పడటంతో... ఇప్పుడు ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు సమస్య తలెత్తింది. ఈ సంఖ్య సంగతి తేలితే తప్ప... అడ్మిషన్లపై ముందుకు వెళ్లే అవకాశం లేదు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు... ఆఫ్‌లైన్ అడ్మిషన్లు జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటున్నాయి. ప్రభుత్వం ముందుగా ఎలాంటి ప్రకటనా చెయ్యకుండా... ఆన్‌లైన్ అడ్మిషన్లు జరపాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి ఇన్నాళ్లూ కరోనా వల్ల తెరచుకోని కాలేజీలు... ఇప్పుడు కొత్త సమస్యల వల్ల ఓపెన్ కావట్లేదు. మరి కోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఓవరాల్‌గా చూస్తే... కరోనాకి వ్యాక్సిన్ వస్తే తప్ప... ఇలాంటి సమస్యలకు బ్రేక్ పడేలా కనిపించట్లేదు.