హరీష్ శంకర్ డైరక్షన్ లో చిరంజీవి సినిమా?.


 

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ లో ఉన్నారు. మెహెర్ రమేష్, కె.ఎస్ రవింద్ర, వినాయక్ లతో సినిమాలు చేస్తాడని తెలుస్తుండగా.. లేటెస్ట్ గా మెగాస్టార్ సినిమాల రేసులో మరో క్రేజీ డైరక్టర్ కూడా చేరినట్టు తెలుస్తుంది. షాక్ తో డైరక్టర్ గా తన జర్నీ మొదలుపెట్టి మిరపకాయ్, గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమాలను ఇచ్చిన హరీష్ శంకర్ డైరక్షన్ లో చిరు సినిమా ఉంటుందని టాక్. మెగా అభిమానిగా పవర్ స్టార్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా హరీష్ శంకర్ తన డైరక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అని అనిపించుకున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో కూడా హరీష్ శంకర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ తో మరో సినిమా ఫిక్స్ చేసుకున్న హరీష్ శంకర్ ఆ నెక్స్ట్ సినిమా మెగాస్టార్ తో ఉంటుందని తెలుస్తుంది. పవర్ స్టార్ తో పవర్ ప్యాక్డ్ మూవీతో వచ్చే హరీష్ శంకర్ ఇక మెగాస్టార్ తో సినిమా అంటే ఇక అంచనాలు తారాస్థాయిలో ఉన్నట్టే. మెగా స్టార్ తో మెగా మూవీ ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్ ఈ దెబ్బతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. కాంబినేషన్ కుదిరితే మాత్రం మెగా ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే లెక్క. ఆచార్య సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో రాం చరణ్ కూడా సెప్షల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది.