సెంటిమెంట్ను నమ్ముకున్న మహేష్

 


మహేష్ బాబు చాలా మొహమాటస్తుడు. షూటింగ్ టైం లో సెట్స్ లో అందరితో జాలిగా ఉండే మహేష్ తన సినిమా ఓపెనింగ్స్ కి మాత్రం హాజరు కాదు. నిర్మాత, దర్శకులు ఎంత గ్రాండ్ గా సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మహేష్ మాత్రం ఆ పూజ సమయంలో కనిపించాడు. ఇది మహేష్ ఎప్పటినుండో ఫాలో అవుతున్నాడు. మహేష్ భార్య నమృత, పిలల్లు, సితార, గౌతమ్ లు మాత్రం మహేష్ సినిమాల ఓపెనింగ్ పూజలకు హాజరవుతారు కానీ మహేష్ రాడు. అంటే మహేష్ కి అది సెంటిమెంట్ ఏమో అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా జరిగిన సర్కారు వారి పాట మూవీ పూజ కార్యక్రమంలో మహేష్ కనిపించలేదు. ఎప్పటిలాగే మహేష్ సినిమా పూజకి రాలేదు. కానీ నమ్రత, సితార మాత్రం సర్కారు వారి పాట పూజకి హాజరవడమే కాదు.. సితార క్లాప్ తో సర్కారు వారి పాట పూజ మొదలయ్యింది. మహేష్ - కీర్తి సురేష్ జంటగా తెరకెక్కనున్న సర్కారు వారి పాట పూజ కార్యక్రాలతో మొదలెట్టినప్పటికీ. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని మూవీ యూనిట్ చెబుతున్న మాట.