ఢిల్లీలో బాణసంచా కాల్చడం నిషేధం


 

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ అదేవిధంగా సమీప ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలు, వాటిని కాల్చడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది. బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేదాజ్ఞలు ఇవాళ అర్థరాత్రి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు ఎన్జీటీ పేర్కొంది. ఎన్‌సీఆర్ పరిధిలోని నాలుగు రాష్ర్టాల్లో గల రెండు డజన్లకు పైగా పట్టణాలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఒకవైపు వాయు కాలుష్యం పెరుగుతుండటం మరోవైపు కరోనా వైరస్ కేసులు అధికమౌతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 7,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీతో పాటు మరికొన్ని కాలుష్య ప్రభావ ప్రాంతాల్లోనూ ఎన్జీటీ ఆంక్షలు విధించింది. గాలి నాణ్యత మోడరేట్ ఉన్న నగరాల్లో పర్యావరణహిత క్రాకర్ల వినియోగానికి అవకాశం కల్పించింది. దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు వంటి సందర్భాల్లో 2 గంటలే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. కాలుష్యం సాధారణమైన నగరాల్లో పర్యావరణహిత క్రాకర్లను వెలిగించవచ్చంది. పర్యావరణహిత క్రాకర్లను ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటలకు వెలిగించవచ్చని పేర్కొంది.