ఆంధ్రప్రదేశ్ కు జాతీయస్థాయిలో మరోసారి అవార్డు

 

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి‌ అవార్డుల పంటపండింది. ఈ అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు వరించాయి. ఓడిఎఫ్, జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్, నూతన టెక్నాలజీలకు అవార్డులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు అవార్డులను కేంద్ర మంత్రి షెకావత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో నిర్వహణ సులభతరమైందని తెలిపారు.