రోగ నిరోధక శక్తి ని పెంచుకోవడం కోసం తీసుకోవలసిన పదార్థాలు


 

శీతాకాలం దాదాపు వచ్చేసినట్టే. సీజన్‌ మారిన కొద్ది అంటురోగాలు, పలురకాల సీజన్‌ వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం అందరి బాధ్యత. ముఖ్యంగా సీజనల్‌ అలర్జీలు రోగ నిరోధక శక్తిని బాగా తగ్గిస్తాయి. అందుకే ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే పిండి పదార్థాలను తెలుసుకుందాం... సజ్జలు: సజ్జ పిండితో ఫైబర్‌తో పాటు పొటాషియం పుష్కలంగా ఉంటుంది. శీతాకాలంలో సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది బంక లేకుండా ఉంటుంది కాబట్టి గోధుమ పిండి తినలేని వారు దీంతో రొట్టేలు చేసుకుంటే మంచిది. ఇందులో ఓమెగా-3, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. సజ్జ పిండి రోగనిరోధక శక్తిని ప్రేరేపించి శరీరంలో మూలకాలను తగిన మోతాదులో సమతుల్యం చేస్తుంది. జొన్నలు: జొన్న పిండి జీర్ణవ్యవస్థను మెరుగుపరచుకుంటుంది. ర్యాడికల్స్‌ను తొలగించి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ పిండితో రొట్టే, ఉప్మా, దోశతో పాటు ప్యాన్‌ కేకులను కూడా తయారు చేసుకోవచ్చు. కొర్రలు: ఫాస్ట్‌ టైల్‌ మిల్లెట్‌ అని పిలిచే కొర్రలు శీతాకాలంలో అద్భుతమైన ధాన్యం. విటమిన్‌ బీ12లో సమృద్ధిగా ఉన్న కొర్రలు గుండె, నాడీ వ్యవస్థను సజావుగా పనిచేసేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తుంది. శనగలు: శీతాకాలంలో విరివిగా ఉపయోగించే వంటకం శనగలు. ఇందులో విటమిన్‌ ఏ, సీ, కే బీటా కేరొటిన్‌ వంటి సెలోనియం లాంటి పోషకాలు ఇందులో ఉన్నాయి. ఐరన్‌ పుష్కలంగా ఉండే ఈ పదార్థాల్లో రక్తహీనత రోగులకు అద్భుత మైన ఆహారం. మంచి రోగనిరోధక శక్తి కోసం శీతాకాలంలో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. రాగి: ఆరోగ్యపరంగా రాగులు ఎంతో మేలు చేస్తాయి. గోధుమ పిండికి సరైన ప్రత్యామ్నాయం. బరువు తగ్గడానికి ఇది గొప్పగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇది త్వరగా జీర్ణమవుతుంది. డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది మంచి ఆహారం.