తగిన jio వేగం గత ఏడాదితో పోల్చితే తగ్గిన జియో లాభాలు


 

ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. 2844 కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ప్రకటించిన రూ.13,248 కోట్లలో రిలయన్స్ బీపీ మొబిలిటీ కోసం బిపీ సంస్థకు విక్రయించిన స్టాక్స్ కూడా ఉన్నాయి. 2020 సంవత్సరంలో రిలయన్స్ స్టాక్ మార్కెట్ వద్ద 35 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్చి 23న క్లోజింగ్ నుంచి లెక్కిస్తే 131 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబర్ 16 నాటికి రూ.16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి చేరుకుంది. ఆ సంస్థ షేర్ ధర రూ.2,369.35కి చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం రూ.9567 కోట్ల లాభం వచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టెలికాం, రిటైల్ రంగాల్లో ఆదాయం పెరిగింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.8380 కోట్ల లాభాలను ఆర్జిస్తే, రెండో త్రైమాసికంలో అది రూ.9567 కోట్లకు పెరిగింది. CNBC-TV18 నిర్వహించిన పోల్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో త్రైమాసికంలో రూ.8134 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేసింది.. అయితే అంతకు మించిన లాభాలను రిలయన్స్ నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆపరేషన్స్ ద్వారా రెవిన్యూ రూ.1,53,384 కోట్లు వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో అది రూ.1,16,195 కోట్లుగా ఉంది.