రాష్ట్ర భద్రతా కమిషన్‌ సభ్యుల నియామక నిబంధనల్లో మార్పులు


 

రాష్ట్ర భద్రతా కమిషన్‌ (స్టేట్ సెక్యూరిటీ కమిషన్-SSC) సభ్యుల నియామక నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఎస్.ఎస్.సిలో ప్రతిపక్ష నేతకు చోటు కల్పించింది. 2018లో ప్రతిపక్ష నేతను.. తప్పిస్తూ జారీ చేసిన నిబంధనలను సవరించింది. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్‌ నిబంధనలు–2020లోని రూల్‌ నంబర్‌–2లోని సబ్‌ రూల్‌–2లో గవర్నమెంట్ సవరణ చేసింది. భద్రతా కమిషన్ ఛైర్మన్‌గా హోం మంత్రి వ్యవహరించనుండగా.. ఇతర సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి ఉంటారు. వివిధ రంగాల్లో సామాజిక సేవలు అందించిన ఐదుగురిని స్వతంత్ర సభ్యులుగా నియమించనున్నారు. వెనకబడిన సామాజికవర్గాల నుంచి ఒకరిని నియమించాలని ప్రభుత్వం సూచించింది. . శాంతిభద్రతలు, పరిపాలన, ప్రజాపాలన, మానవ హక్కులు, సామాజిక సేవ, వంటి అంశాల్లో ప్రముఖులను స్వతంత్ర సభ్యులుగాస్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చేర్చనున్నారు