WHO లో 65 ఉద్యోగులకు కరోనా పాజిటివ్




దాదాపు గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన భయంకరమైన కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలలో కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఇంకనూ దాని ప్రభావం తీవ్రత తగ్గలేదు. ఇక ఈ కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్య దేశాల శాస్త్రవేత్తలు మరియు ఫార్మా నిపుణులు రేయింబవళ్ళు కష్టపడుతూ వ్యాక్సిన్ కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు రెండవ, మూడవ దశల ప్రయోగాలలో ఉన్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (World health Organisation) లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఈ కరోనా వైరస్ బారినపడ్డారని వార్త లు హల్ చల్ చేస్తున్నాయి . జెనీవాలోని కార్యాలయంలో ది. 'ది అసోసియేటెడ్‌ ప్రెస్‌'కు చెందిన ఓ ఇ-మెయిల్‌ ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. ఈ కరోనా వైరస్ సోకిన వారిలో సగం మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తుండగా.. 32 మంది ఉద్యోగులు మాత్రం కార్యాలయానికి వస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఈ వార్తలను WHO అధికారులు ఖండించారు. జెనీవాలో ఎవరికీ కొవిడ్‌ సోకలేదని చెబుతున్నారు. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో కార్యాలయాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూనే.. స్క్రీనింగ్, శానిటైజేషన్, వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇంతలా పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో సిబ్బంది వైరస్ బారినపడటం చర్చనీయాంశంగా మారింది. ఇక యూరప్‌ దేశాల్లో కరోనా మళ్లీ భీభత్సంగా విజృంభిస్తోంది. అలాగే స్విట్జర్లాండ్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జెనీవా (Geneva) లోని డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది కూడా కరోనా బారిన పడినట్లు వార్తలు రావడంతో పలువురు విస్మయం చెందుతున్నారు.