Zoom వాడేవారికి శుభవార్త

 

Zoom వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ వాడే వారికి శుభవార్త.

USలో ప్రతి సంవత్సరం కృతజ్ఞతా పూర్వకంగా నిర్వహించుకునే Thanksgiving Day సందర్భంగా ఆ సంస్థ తన యూజర్లకు తాత్కాలికంగా ఒక సదుపాయం కల్పించింది. Zoom అప్లికేషన్లో ఎలాంటి అమౌంట్ చెల్లించకుండా ఉచితంగా వాడుకునే వారు గరిష్ఠంగా 40 నిమిషాలు మాత్రమే మీటింగ్ నిర్వహించుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో Thanksgiving Dayని దృష్టిలో పెట్టుకొని, తన వినియోగదారులకు కృతజ్ఞత చూపిస్తూ Zoom సంస్థ పరిమిత కాలానికి ఆ నలభై నిమిషాల పరిమితిని ఎత్తేస్తోంది. భారతీయ కాలమానం ప్రకారం నవంబర్ 26వ తేదీ నుండి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల నుండి 40 నిముషాలు పరిమితి లేకుండా వీడియో కాన్ఫరెన్స్‌లు జూమ్ ద్వారా నిర్వహించుకోవచ్చు.