ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ లేనిదే ఫోన్ ఉండదు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ ఈ ఏడాది అనేకమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది కూడా చాలా ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ ఏడాది తీసుకువచ్చిన టాప్ 10 ఫీచర్లు ఏంటో చూద్దాం. 1. Whatsapp-Disappearing Messages: ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ వాడే అనేక మంది ఎప్పటికప్పుడు చాట్ డిలీట్ చేసుకోవడం మర్చిపోతుంటారు. వందలాది మెసేజ్‌లు అలానే ఉండిపోతాయి. దీంతో ఫోన్ కూడా స్లో కావడం జరుగుతుంటుంది. దీంతో వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజెస్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ ఎనబుల్ చేసుకున్న వారికి పంపే మెసేజ్ లు వారం తర్వాత వాటంతట అవే డిలీట్ అవుతాయి. 2. WhatsApp Payments: వాట్సాప్ పేమెంట్.. ఇది ఈ ఏడాది అందరికి ఉపయోగపడే ఫీచర్ అని చెప్పవచ్చు. ఈ ఫీచర్‌తో UPI ద్వారా వాట్సాప్ యూజర్లు మెసేజ్ పంపినంత సులువుగా నగదు చెల్లింపులు జరుపుకొనే అవకాశం ఉంటుంది. ఇందు కోసం వాట్సాప్ దాదాపు 160 బ్యాంకులతో పని చేస్తోంది. 3. Customised Wallpapers: కస్టమైజ్డ్ ఫీచర్ ద్వారా వాట్సాప్ లో ప్రతి చాట్‌కు ఓ ప్రత్యేకమైన వాల్ పేపర్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోలను కూడా మనం వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు. 4. WhatsApp Permanent Mute Option: వాట్సాప్ పర్మెనెంట్ మ్యూట్ ఆప్షన్.. కొన్ని వాట్సాప్ గ్రూపులతో మనం పెద్దగా పని ఉండదు. కానీ అలాంటి గ్రూపులకు వచ్చే మెసేజ్‌లు, తద్వారా వచ్చే శబ్దం, వైబ్రెషన్ కారణంగా కాస్త చికాకు తెప్పిస్తుంటుంది. ఆ ఇబ్బందులు తొలగించడం కోసం వాట్సాప్ పర్మినెంట్ మ్యూట్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఆ ఆప్షన్ ను ఎంచుకుని ఏదైనా చాట్, గ్రూప్‌ను పర్మినెంట్‌గా మ్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 5. WhatsApp Animated Stickers: అనిమేటెడ్ స్టిక్కర్స్… చాట్‌ను మరిత ఫన్‌గా, ఆసక్తికరంగా ఉండేందుకు వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో మన అనిమేటెడ్ స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకుని మనతో చాట్ చేసే వ్యక్తులను మరింత ఉత్సాహం పర్చేలా చేయవచ్చు. 6. WhatsApp Group Video Calls: ఈ మధ్య కాలంలో వీడియో కాలింగ్ చేసుకునే అలవాటు చాలా మందికి పెరిగిపోయింది. ఇది వరకు ఇతర యాప్‌ల ద్వారా మాత్రమే వీడియో కాలింగ్ చేసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు వాట్సాప్ కూడా గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన వీడియో కాల్ ఫీచర్ యూజర్లను మరింత ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ ద్వారా ఒకే సారి ఎనిమిది మందితో వీడియో కాల్లో మాట్లాడే సదుపాయం ఉంది. 7. WhatsaApp Advanced Search Options: వాట్సాప్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆప్షన్.. ఈ రోజుల్లో దాదాపు అందరి వాట్సాప్ లో వందలు, వేలాది మెసేజ్‌లు ఉంటాయి. అయతే మనకు వచ్చని ఏదైనా ముఖ్యమైన మెసేజ్‌ను వెతుక్కోవడం కొంత ఇబ్బందికరమైన విషయం. అందులో మనకు కావాల్సిన ముఖ్యమైన మెసేజ్ వెతుక్కోవడం చాలా కష్టం. అలాంటి వారి కోసం వాట్సాప్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే కాకుండా డాక్యుమమెంట్లు, ఫోటోలు, వీడియోలు, జీఐఎఫ్ ఫైళ్లను సైతం సులువుగా వెతుక్కునే అవకాశం ఉంటుంది. 8. WhatsApp QR Codes: ఈ వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ QR కోడ్ ఫీచర్ ద్వారా యూజర్లు సులువుగా కాంటాక్టులను యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వారి కాంటాక్ట్ వివరాలను కస్టమైస్డ్ క్యూఆర్ కోడ్ ద్వారా పంపించుకోవచ్చు. 9. WhatsApp Dark Mode: ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ లాంటికే పరిమితంగా ఉండే ఈ డార్క్ కోడ్‌ను సంవత్సరం యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్ కొత్తగా కనిపించడమే కాకుండా యూజర్ల కళ్ల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ డార్క్ మోడ్ లేని కారణంగా కళ్లమీద ప్రభావం చూపే అవకాశం ఉండేది. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 10. WhatsApp New Storage Mangement Tool: మామూలుగా వాట్సాప్ లో ఓ పరిమితికి మించి టెక్స్ట్ మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలను స్టోర్ చేసుకునే అవకాశం లేదు. మనం వాటిని కొన్ని సార్లు తొలగించడం మర్చిపోతుంటాము. దీంతో వాట్సాప్ న్యూ స్టోరేజ్ మెసేజ్మెంట్ టూల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వాఆ 5 ఎంబీ కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైళ్లను మనకు ముందు వరుసలో చూపిస్తుంటుంది. దీంతో మనం అవసరమైన ఫైళ్లను డిలీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఈ ఏడాది వచ్చిన టాప్ 10 ఫీచర్లు. రోజురోజుకు వాట్సాప్ వినియోగం పెరిగిపోతుండటంతో వాట్సాప్ ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ముందుముందు మరిన్ని ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంది.