1000 మందితో రాధే శ్యామ్‌'. ఎపిసోడ్.

 

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్‌తో పాటు, అతని ఫ్రెండ్స్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తయారవుతోంది. మొదట ఇందులో యాక్షన్ సీన్స్ ఏమీ ఉండవని ప్రచారం జరిగింది. కానీ మంగళవారంతో ముగిసిన నెల రోజుల షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను డైరెక్టర్ చిత్రీకరించాడు.

హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పోవెల్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ల కోసం వెయ్యి మంది వంద రోజుల పాటు శ్రమించారని రాధాకృష్ణ కుమార్ తెలిపాడు.

తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిక్ పోవెల్‌తో దిగిన పిక్చర్‌ను షేర్ చేసిన అతను, "ఒక నెల పాటు జరిగిన యాక్షన్ షెడ్యూల్‌లో వెయ్యి మంది నాన్‌స్టాప్‌గా 100 రోజుల పాటు పనిచేసి నా రెండేళ్ల కలను నిజం చేశారు. గతంలో ఎన్నడూ చూడని ఈ అడ్వంచర్‌ను చేసినందుకు మా యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్‌, ఆయన టీమ్‌కు మనోజ్ పరమహంస (సినిమాటోగ్రాఫర్‌), రవీందర్ (ప్రొడక్షన్ డిజైనర్‌), యువి క్రియేషన్స్‌తో కూడిన మా టీమ్ థాంక్స్ చెబుతోంది" అని రాసుకొచ్చాడు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ ఆన్‌లైన్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్‌తో పాటు, అతని ఫ్రెండ్స్ ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తయారవుతోంది. మొదట ఇందులో యాక్షన్ సీన్స్ ఏమీ ఉండవని ప్రచారం జరిగింది. కానీ మంగళవారంతో ముగిసిన నెల రోజుల షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను డైరెక్టర్ చిత్రీకరించాడు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పోవెల్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ల కోసం వెయ్యి మంది వంద రోజుల పాటు శ్రమించారని రాధాకృష్ణ కుమార్ తెలిపాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిక్ పోవెల్‌తో దిగిన పిక్చర్‌ను షేర్ చేసిన అతను, "ఒక నెల పాటు జరిగిన యాక్షన్ షెడ్యూల్‌లో వెయ్యి మంది నాన్‌స్టాప్‌గా 100 రోజుల పాటు పనిచేసి నా రెండేళ్ల కలను నిజం చేశారు. గతంలో ఎన్నడూ చూడని ఈ అడ్వంచర్‌ను చేసినందుకు మా యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్‌, ఆయన టీమ్‌కు మనోజ్ పరమహంస (సినిమాటోగ్రాఫర్‌), రవీందర్ (ప్రొడక్షన్ డిజైనర్‌), యువి క్రియేషన్స్‌తో కూడిన మా టీమ్ థాంక్స్ చెబుతోంది" అని రాసుకొచ్చాడు. ఇదివరకు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ ఆన్‌లైన్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే.