సీబీ‌ఎస్‌సీ 10వ,12వతరగతి బోర్డు పరీక్షలు వాయిదా.

 


సీబీ‌ఎస్‌సీ విద్యార్థులకు ముఖ్య గమనిక. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో జరిగే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తాజాగా ఉపాధ్యాయులతో జరిగిన వెబ్‌నార్‌లో వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా లేవని.. బోర్డు ఎగ్జామ్స్‌పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ”పరీక్షలను రద్దు చేసి.. విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడం సాధ్యపడదు. ఒకవేళ అలా చేస్తే స్టూడెంట్స్ భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. ఉన్నత విద్యకు ప్రవేశాలు, ఉద్యోగాలు పొందటం కష్టతరం అవుతుంది. అందువల్ల పరీక్షలను రద్దు చేయడం జరగదు. కేవలం మరికొద్ది రోజుల పాటు వాయిదా వేస్తాం. ప్రస్తుతానికి జనవరి-ఫిబ్రవరి మధ్య 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ మాత్రం జరగవు. కానీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో అన్న దానిపై ఫిబ్రవరి తర్వాత నిర్ణయం తీసుకుంటామని” కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. త్వరలోనే 6వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ బేసిస్‌లో వృత్తి శిక్షణను ప్రవేశపెడతామని.. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) 2020 దీనిని పొందుపరిచామని ఆయన అన్నారు. కోవిడ్ కారణంగా వివిధ దేశాలు ఈ ఏడాది అకాడమిక్ ఇయర్‌ను రద్దు చేశారు. కానీ మన దేశంలోని ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి పని చేస్తున్నారు. ఏ ఒక్క విద్యార్ధి తన విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేలా చూసుకుంటున్నారని ఆయన కొనియాడారు. “పాఠశాల స్థాయిలో AI ని పరిచయం చేస్తున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఇండియా” అవుతుందని ఆయన పేర్కొన్నారు.