తూర్పుగోదావరి జిల్లాలో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్.

 


పేరెంట్స్‌ కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ఇంతలో కూతురు కిడ్నాపయింది. అది ఎవరి పని.. కన్న తల్లే కూతురిని కిడ్నాప్ చేయించిందా? భార్యను బ్లాక్‌మెయిల్ చేసేందుకు.. కన్న తండ్రే కూతురిని అపహరించే కుట్ర పన్నాడా? భార్యాభర్తల మధ్య గొడవను క్యాష్‌ చేసుకునేందుకు థర్డ్‌ పార్టీ రంగంలోకి దిగిందా? ఈ డౌట్స్‌కి పోలీసులు తెర దించారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. శానపల్లిలో సంయుక్తను కన్న తల్లే కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లినట్టు గుర్తించారు. విజయవాడలోని ప్రైవేట్‌ లాడ్జిలో బాలికను గుర్తించారు. కొద్దిరోజులుగా భార్య, భర్తల గొడవల నేపథ్యంలో తండ్రి దగ్గరే ఉంటోంది సంయుక్త.. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తాత దగ్గరకు వచ్చింది.. తాతయ్య ఇంటి దగ్గర నుంచి సంయుక్తను తల్లి ఎత్తుకెళ్లినట్టు తేలింది