ఐపీఎల్ 14సీజన్ కు రంగం సిద్ధం........

 


ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే సీజన్‌ను ఇండియాలో జరిపేందుకు సన్నద్ధమవుతోంది. క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత కిక్కిచ్చేలా లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో ఆటగాళ్ల మినీ ఆక్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2022లో కొత్తగా ఒకటి లేదా రెండు జట్లు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన బీసీసీఐ వార్షిక సమావేశం జరగనుంది. అందులో కొత్త జట్ల ప్రతిపాదనపై చర్చించి, ఆమోదముద్ర వేయనున్నారు. అటు జనవరి 10 నుంచి 31 వరకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ జరగనుండగా.. దేశవాళీ ఆటగాళ్ళను వేలంలో ఎంచుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఉపయోగపడనుంది