సంక్రాంతి పండుగ సందర్భంగా 1800 ప్రత్యేక బస్సులు నడపనున్న టి .ఎస్ .ఆర్ .టి .సి.

 


సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. టీఎస్ఆర్టీసీ అధికారుల కథనం ప్రకారం జనవరి 8 నుంచి జనవరి 13 మధ్య రోజుల్లో ఏపీకి 1800 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో ప్రయాణించే టికెట్టు ధర కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా ధర ఉండనున్నట్లు తెలియజేశారు. ఈ బస్సు సర్వీసులు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్, ఎల్బీ నగర్ బస్టాండ్ల నుంచి నడపనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మరో 1200 బస్సు సర్వీసులను దేశంలోని ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కు నడపనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం సంక్రాంతి పండుగ సందర్భంగా 3607 బస్సు సర్వీసులను జనవరి 8 నుంచి 13 వరకు తెలంగాణకు నడపనుంది.