జనవరి 1న ‘క్రాక్‌’ సినిమా ట్రెయిలర్ విడుదల.

 


రవితేజ, శృతి హాసన్‌ జంటగా ‘క్రాక్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్న ఈ సినిమాకు గోపిచంద్‌ మలినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లు చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్‌ రవితేజ అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇవ్వనుంది. జనవరి 1న చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రాక్‌ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ‘నేల టికెట్టు’, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’, ‘డిస్కో రాజా’ వంటి వరుస పరాజయాల తర్వాత విడుదలవుతోన్న చిత్రం కావడంతో రవితేజాకు ఈ సినిమా కీలకంగా మారింది. శృతి హాసన్‌ కూడా చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దీంతో ఈ సినిమా విజయంపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. మరి క్రాక్‌ రవితేజ కెరీర్‌ను మళ్లీ గాడిలో పెడుతుందా? శృతికి తెలుగులో ఆఫర్లు తెచ్చిపెడుతుందో లేదో తెలియాలంటే క్రాక్‌ విడుదల వరకు వేచి చూడాలి.